ASF: కౌటాల మండల కేంద్రం శివారులో అటవీ ప్రాంతంలోని నీలగిరి చెట్లలో మంటలు రాజుకున్నాయి. మంగళవారం ఉదయం ఎవరో గుర్తులు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లుగా స్థానికులు భావిస్తున్నారు. అట విశాఖ అధికారులకు సమాచారం అందించినట్లుగా వారు తెలిపారు. నీలగిరి చెట్లలో మంటలు అంటుకోవడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.