శ్రీకాకుళం మండలం అరసవిల్లి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ సూర్యనారాయణ స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవం మార్చి 29న నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయం కార్య నిర్వహణ అధికారి K.N.V.D.V ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉష పద్మని ఛాయా సమేత శ్రీస్వామి వారి కళ్యాణ ఉత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలన్నారు.