GNTR: కొండముడి గ్రామంలోని మంచినీళ్ల చెరువులో మట్టి పనుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలువ నుంచి వస్తున్న నీరు మురికిగా ఉండడంతో భయాందోళనకు గురవుతున్నామన్నారు. చెరువు సమస్యపై అధికారులు వెంటనే స్పందించి శుభ్రమైన నీరు అందించాలని, చెరువును పూర్తిగా శుభ్రపరచాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.