కోనసీమ: ప్రజలు సైబర్ నేరాలు బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని కాట్రేనికోన ఎస్సై అవినాష్ సూచించారు. కాట్రేనికోన మండలం నడవపల్లి గ్రామంలో సోమవారం అర్ధరాత్రి ఎస్సై పల్లె నిద్ర చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ఎస్సై గ్రామస్తులతో మాట్లాడి గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకున్నారు. ఏమైనా ఘర్షణలు జరిగితే తమకు తెలియజేయాలన్నారు.