VZM: ఐదేళ్లు నిండిన పిల్లలను వారి తల్లిదండ్రులు విధిగా బడిలో చేర్పించాలని వేపాడ మండలం డీబీ పేట ఎంపీపీ పాఠశాల హెచ్ఎం పి. వరప్రసాద్ కోరారు. మంగళవారం ఆయన గ్రామంలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. గ్రామంలో 13 మంది బడి ఈడు పిల్లలను గుర్తించామని, వారి తల్లిదండ్రులకు అడ్మిషన్ ఫామ్ అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.