విజయనగరం: రావివలస గ్రామంలో మురుగు కాలువలు క్లీన్ లేకపోవడంతో మురుగు నీరు రోడ్లపైకి పొంగి వస్తోంది. దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఇళ్లలోకి మురుగు నీరు చేరడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోమలు, దుర్వాసనతో జీవనం కష్టమైందని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్ధానికులు కోరుతున్నారు