HYD: విత్తనాల కొరత సమస్యలు తలెత్తకుండా HYDలో భారత ఉద్యాన పరిశోధన సంస్థ (ICAR) నాణ్యమైన మేలిమి రకం విత్తనాలను అభివృద్ధి చేసింది. ఉద్యానవన శాఖ టమాటా, బెండకాయ, మిర్చి, తోటకూర, పాలకూర విత్తనాలను ప్యాకెట్లుగా సిద్ధం చేసింది. అర ఎకరానికి సరిపడేలా ఐదు రకాల విత్తనాలను కిట్ల రూపంలో త్వరలో రైతులకు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.