కృష్ణా: బాలల సంక్షేమం, సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. బాల్య వివాహాలు, పిల్లలపై లైంగిక వేధింపుల నివారణకు పోక్సో, జువెనైల్ జస్టిస్ చట్టాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామ స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, సమాచారం అందగానే అధికారులు వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించారు.