హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,940 తగ్గి రూ.1,40,350కి చేరగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,700 తగ్గి రూ.1,28,650గా ఉంది. అదేవిధంగా వెండి రూ.10,000 తగ్గి రూ.2,40,000 వద్దకు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.