TG: బీజేపీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో దివ్యాంగులతో కలిసి అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ర్యాలీగా బయలుదేరారు. దివ్యాంగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. పెన్షన్ పెంపు హామీ అమలు చేయాలని కోరారు.