NRML: మామడ మండలంలోని కిషన్రావుపేట గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. గ్రామస్థుల ఫిర్యాదుల మేరకు సర్పంచ్ రాథోడ్ వసంతరావు ఆధ్వర్యంలో జేసీబీ సాయంతో మురుగు కాలువల్లో పేరుకుపోయిన పూడిక, చెత్తాచెదారాన్ని తొలగించారు. వర్షాకాలం ముందు వ్యాధులు ప్రబలకుండా అపరిశుభ్ర ప్రాంతాలను శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.