MNCL: జన్నారం మండలం తంగళ్లపల్లి సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. బైకు అదుపుతప్పి కింద పడటంతో ప్రమాదం జరిగిందన్నారు. వెంటనే 108 వాహనానికి సమాచారం అందించగా, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.