NTR: కొండపల్లిలోని ఐజీఎన్ఐటీఈ సెల్‌ను కలెక్టర్ లక్ష్మీశ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా పర్యాటక శాఖ చేపట్టిన కార్యక్రమాన్ని అభినందించారు. ప్రాంతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే కొండపల్లి బొమ్మలను ప్రోత్సహించడం ద్వారా స్థానిక కళాకారులకు మద్దతు అందించడమే కాకుండా, జిల్లాలో సుస్థిర పర్యాటక అభివృద్ధి లక్ష్యాన్ని బలపరుస్తుందని తెలిపారు.