NDL: ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా మంత్రి ఎన్ఎండీ ఫరూక్ నంద్యాలలో అవగాహన పోస్టర్ను విడుదల చేశారు. క్షయ రహిత సమాజం కోసం ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా పరీక్షలు, మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 2 వారాలకు పైగా దగ్గు వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.