KDP: రాజంపేట బైపాస్ రోడ్డులోని తిరుమల బార్లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. ఫ్లెక్సీలు, రేకుల నిర్మాణం మంటల్లో దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రాణనష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.