»Elon Musk Reveals Plan To Turn X Into A Dating Feature
Xలో మరిన్ని మార్పులు.. డేటింగ్ ఫీచర్, డిజిటల్ బ్యాంకింగ్ సర్వీస్ కూడా
ఎక్స్‌లో మరిన్ని మార్పులు చేస్తున్నారు ఎలాన్ మస్క్. వచ్చే ఏడాదికల్లా డేటింగ్ ఫీచర్ అందుబాటులోకి వస్తోందట.. అలాగే డిజిటల్ బ్యాంకింగ్ సర్వీస్ కూడా ఇస్తారని తెలిసింది.
Elon Musk Reveals Plan To Turn X Into A Dating Feature
Elon Musk X: ట్విట్టర్ కొనుగోలు చేసిన అందులో చాలా మార్పులే చేశారు ఎలాన్ మాస్క్ (Elon Musk). తొలుత ఉద్యోగుల తొలగింపు, కొందరి అకౌంట్ల తొలగించి, మళ్లీ చేర్చారు. బ్లూ టిక్ కోసం డబ్బుల వసూల్, చివరికీ పేరును ఎక్స్‌గా మార్చారు. దీంతో కంపెనీ బ్రాండ్ వ్యాల్యూ పడిపోయింది. యూజర్లు ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. అయినప్పటికీ మస్క్ (Musk) ఆలోచన తీరు మారడం లేదు. 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయగా 20 బిలియన్ డాలర్ల మేర క్షీణించిందని తెలుస్తోంది. అయినప్పటికీ తన రూటే సపరేటు అంటున్నారు మస్క్.
ఇప్పటికే మస్క్ చర్యలతో అటు ఉద్యోగులు.. ఇటు యూజర్లు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా ఎక్స్‌లో డేటింగ్ ఫీచర్ తీసుకొస్తామని సంచలన ప్రకటన చేశారు. అవును ట్విట్టర్ యానివర్సరీ సందర్భంగా ఈ విషయం చెప్పారట. ఇందుకోసం ప్రణాళికలు కూడా రచించారని తెలుస్తోంది. యాప్‌లో డేటింగ్ ఫీచర్ తీసుకొస్తారట.. కానీ ఓకే సైట్ మీద ఆ ఫీచర్ ఎలా అందుబాటులోకి వస్తుందనే విషయం మాత్రం తెలియరాలేదు. వచ్చే ఏడాదికి మాత్రం అందుబాటులోకి వస్తోందని తెలిసింది.
డేటింగ్ ఫీచర్‌తోపాటు డిజిటల్ బ్యాంకింగ్ ఫీచర్ కూడా అందుబాటులోకి వస్తోందని తెలిసింది. ఎక్స్‌ను ఎవ్రీథింగ్ యాప్‌గా మారుస్తామని ఇదివరకే మస్క్ పేర్కొన్నారు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆదాయ మార్గాలను అన్వేషించే పనిలో ఉన్నట్టు ఉన్నారు. కానీ యూజర్లకు ఏం కావాలో మస్క్‌కు అర్థం కావడం లేదని ఉద్యోగులు గుసగుసలు పెడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.
సోషల్ మీడియాలో వెలుగు వెలిగిన ట్విట్టర్ కాస్తా.. క్రమంగా ప్రభను కోల్పోతుంది. ఆ సైట్‌కు మరొ ప్రత్యామ్నాయం లేకపోవడంతో మంచిది అయ్యింది. లేకుంటే పరిస్థితి మరోలా ఉండేది. ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్ బర్గ్ థ్రెడ్స్ తీసుకొచ్చిన.. అది యూజర్లను అంతలా ఆకట్టుకోలేదు.