పార్వతీపురం జిల్లాలోని ప్రజారోగ్యాన్ని కాపాడటంలో అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు క్షేత్రస్థాయిలో నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించాలని ఆదేశించారు.