విజయనగరం: బొబ్బిలిలో వంట గ్యాస్ కోసం ప్రజలు గ్యాస్ ఏజెన్సీకి క్యూ కడుతున్నారు. గ్యాస్ బుక్ చేసి రెండు వారాలు కావస్తున్న డెలివరీ చేయకపోవడంతో ఖాళీ సిలిండర్లతో ఏజెన్సీకి వస్తున్నారు. యుద్ధం ప్రభావంతో గ్యాస్ కొరత ఏర్పడింది. గ్యాస్ కొరత నివారణకు చర్యలు తీసుకుని గ్యాస్ సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు. ఓటీపీ వచ్చిన గ్యాస్ ఇవ్వడం లేదని వాపోతున్నారు.