సీనియర్ నటి భానుప్రియ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి ఎం లక్ష్మి(83) ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఎం లక్ష్మికి భానుప్రియ, శాంతిప్రియతో పాటు గోపాలకృష్ణ అనే కుమారుడు ఉన్నాడు. ఆమె తన ఇద్దరు కూతుర్లను సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా తీర్చిదిద్దారు.