TG: ఆదిలాబాద్ బస్టాండ్ సమీపంలో అమానవీయ ఘటన జరిగింది. మద్యం మత్తులో రెండు నెలల శిశువును రోడ్డుపై తల్లి వదిలేసింది. శిశువును గమనించి చైల్డ్ హెల్ప్లైన్కి పోలీసులు సమాచారం ఇచ్చారు. బాల్ రక్షక్ వాహనంలో ఘటనా స్థలికి చేరుకుని శిశు గృహకు శిశువును అప్పగించారు. మద్యం మత్తులో ఉన్న తల్లిని పోలీసులు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.