NLR: ఆంధ్ర, తమిళనాడు జాలర్ల మధ్య తరచూ తలెత్తుతున్న వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోరారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. తమిళ జాలర్లు అక్రమంగా ఆంధ్ర తీర ప్రాంతం వైపునకు చొరబడటం వల్ల స్థానిక జాలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే తెలిపారు.