KMR: పిట్లం గడి హనుమాన్ ఆలయంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి 11వ వార్షికోత్సవాన్ని నేడు ఉదయం 8 గంటలకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, హారతులు జరగనున్నాయి. అనంతరం భక్తులకు మహా అన్నప్రసాద వితరణ ఉంటుంది. ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు.