హన్మకొండలో ఎండు గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులకు కోర్టు కఠిన శిక్ష విధించింది. ఒక్కొక్కరికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ మొదటి అదనపు న్యాయమూర్తి బి.అపర్ణాదేవి తీర్పు వెల్లడించారు. 2023 జూలై 28న సుబేదారి పోలీసులు వడ్డెపల్లి క్రాస్ రోడ్డు వద్ద నిందితులను పట్టుకుని గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.