AP: పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరం నుంచి 100 MBBS సీట్ల భర్తీకి తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. అధికారులతో నిర్వహించిన వర్చువల్ సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో కార్యదర్శి సౌరభ్ గౌర్, డీఎంఈ రఘునందన్, ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు పాల్గొని పురోగతిని వివరించారు.