KDP: పులివెందుల పట్టణంలోని కదిరి రోడ్డులో సోమవారం సాయంత్రం 11 బస్తాల రేషన్ బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ డీటీ సుధీర్ రెవెన్యూ సిబ్బందితో కలిసి స్వాధీనం చేసుకున్నారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు డీటీ తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పంచనామా నిమిత్తం గోదాంకు తరలించారు.