NLR: కోవూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి విడవలూరు మండలం వావిళ్ళ గ్రామంలో రూ. 47 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ గురించి ప్రజలకు వివరించారు.