KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న జరిగే సీతారాముల కళ్యాణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు మార్చి 30లోపు పూర్తి చేయాలని టీటీడీ జేఈఓ వి. వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, కళ్యాణ వేదిక తదితర ప్రాంతాలను పరిశీలించిన ఆయన భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.