KRNL: మహిళలు ప్రతి రంగంలో రాణించాలని దేనిలో తక్కువ కాదని ఏఎస్పీ జావలి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం నంద్యాలలోని పోలీస్ క్వార్టర్స్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిపిన క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. మహిళలకు మహిళా చట్టంపై అవగాహన కల్పించారు. ప్రతి మహిళా ఒక వృత్తిని ఎంచుకుని అందులో రాణించాలని పేర్కొన్నారు.