AP: రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులకు వెంటనే ఇళ్ల స్థలాలు, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. పేదల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ నిరసనలు చేపడుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి హామీలను నెరవేర్చాలని వారు కోరుతున్నారు.