E.G: గోకవరం పంచాయతీ కార్యాలయం వద్ద నేడు ‘వికసిత్ భారత్ జీ రామ్ జీ’ గ్రామసభ నిర్వహిస్తున్నట్లు APO అప్పలరాజు సోమవారం తెలిపారు. 2026 వార్షిక తనిఖీల్లో భాగంగా ఈ పబ్లిక్ హియరింగ్ జరుగుతుందన్నారు. ఉపాధి శ్రామికులు, తదితరులు హాజరై పనుల వివరాలు తెలుసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో జరిగిన పనుల పారదర్శకతను పరిశీలించేందుకు ఈ సభ ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.