AP: YS జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయడమే లక్ష్యంగా షర్మిల, సునీత పనిచేస్తున్నారని YCP MLC వరుదు కళ్యాణి మండిపడ్డారు. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలుగా మారి వారు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. జగన్ సహనాన్ని బలహీనతగా తీసుకోవద్దని, ఆయన దమ్ము ఏంటో బాబును అడిగితే చెబుతారని చెప్పారు. కోట్లాది మంది ఆడబిడ్డలు జగన్ను తమ అన్నగా భావిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.