NLG: చిట్యాల మండలం పెద్ద కాపర్తి సర్వీసు రోడ్డులో సోమవారం మిల్క్ ట్యాంకర్‌ను ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్ మినహా ఎవరూ లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పింది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న ఫ్లైఓవర్ పనుల కారణంగా ట్రాఫిక్‌ను సర్వీసు రోడ్డు గుండా మళ్లిస్తుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు.