ATP: రాయదుర్గం పురపాలక సంఘపు మార్కెట్ వేలం పాటలు సోమవారం మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి కార్యాలయంలో నిర్వహించారు. 31 మంది వేలం పాటలో పాల్గొన్నారు. వేలం పాటల సందర్భంగా ఘర్షణ జరగడంతో ఈసారి కూడా ఘర్షణ జరుగుతుందనే ఉద్దేశంతో ఇన్స్పెక్టర్ జయ నాయక్, ఎస్సై ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరో మారు ఉద్రిక్తత చోటుచేసుకోగా బుధవారానికి వేలం వాయిదా వేశారు.