పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఇవాళ నిర్వహించిన టెన్త్ క్లాస్ ఆంగ్లం పరీక్షకు 7478 మంది విద్యార్థులు హాజరయ్యారని DEO శారద ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 7,484 మంది విద్యార్థులకు గాను ఆరుగురు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. 99.9% విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.