W.G: భీమవరం కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం “మీ ఇంటికి మీ డాక్టర్” మొబైల్ మెడికల్ యూనిట్‌ను కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. వాహనంలో ఏర్పాటు చేసిన వైద్య సదుపాయాలను పరిశీలించారు. ఆసుపత్రులకు రాలేని ప్రజలకు ఈ మొబైల్ మెడికల్ యూనిట్ ఎంతో ఉపయుక్తంగా మారుతుందని ఆమె పేర్కొన్నారు. సుమారు రూ.1.30 కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్ట్ జిల్లాలో నిర్వహిస్తామన్నారు.