చిగుళ్ల నుండి రక్తం రావడం కేవలం నోటి సమస్యే కాదు. అది శరీరంలో విటమిన్-C లోపానికి సంకేతం కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పళ్లు తోముతున్నప్పుడు రక్తం పడితే అది స్కర్వీ వంటి వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంది. పెద్దలు రోజుకు కనీసం 90 MG విటమిన్-C తీసుకోవడం చాలా అవసరం. బత్తాయి, నారింజ, జామ వంటి పండ్లను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని సూచిస్తున్నారు.