SRPT: విప్లవ వీరుడు భగత్ సింగ్ ఆశయ సాధనలో యువత ముందుకు సాగాలని AIYF జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సైదులు, శ్రీకాంత్ పిలుపునిచ్చారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ధర్మభిక్షం భవనంలో భగత్‌సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భగత్ సింగ్ కలలుగన్న సోషలిజం, దోపిడీ లేని సమాజ స్థాపన కోసం యువత పోరాడాలని కోరారు.