VZM: వేపాడ మండలంలోని అన్ని పంచాయతీల్లో ఇంటి పన్ను వసూళ్లు 100 శాతం జరిగేలా పంచాయతీ కార్యదర్శులు చర్యలు చేపట్టాలని ఎంపీడీవో సీహెచ్ సూర్యనారాయణ కోరారు. సోమవారం ఆయన మండలంలోని దబ్బిరాజుపేట సచివాలయాన్ని సందర్శించి, రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.