‘ధురంధర్ 2’ చిత్రంలో భాగం కావడంపై నటుడు రాకేష్ బేడీ హర్షం వ్యక్తం చేశాడు. అయితే, ఈ సినిమాలోని కీలక దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని ప్రేక్షకులను కోరాడు. ఇలా చేయడం వల్ల సినిమాపై ఇతరులకు ఉండే ఆసక్తి, థ్రిల్ దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశాడు. సినిమా స్ఫూర్తిని గౌరవించి, ప్రతి ఒక్కరూ థియేటర్లో ఆ అనుభూతిని పొందేలా సహకరించాలని విజ్ఞప్తి చేశాడు.