GDWL: జిల్లాలో RTC బస్సులు నడిపే డ్రైవర్లు ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బలిగేరా మోజెస్ తెలిపారు. సోమవారం గద్వాల కలెక్టరేట్లోని ప్రజావాణి కార్యక్రమంలో ఆయన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతిపత్రం సమర్పించారు. దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు.