KRNL: కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను జేసి నూరుల్ ఖమర్ స్వీకరించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను విన్నవించుకున్నారు. వాటిని వినిన జాయింట్ కలెక్టర్, సంబంధిత అధికారులకు సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.