TG: ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు గడిచినా.. గ్యారెంటీ హామీలు ఎందుకు అమలు కావడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. భట్టి మాటలకు అర్థాలు వేరులే అన్నట్లుగా పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం రుణమాఫీపై అనేక లెక్కలు చెప్పిందన్నారు. కానీ వేలాది మంది రైతులకు రుణమాఫీ జరగలేదని విమర్శించారు. ప్రభుత్వం గత బడ్జెట్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.