WGL: నెక్కొండ (M)లోని అప్పలరావుపేటకు చెందిన దళిత యువకుడు బిర్రు సురేందర్ ఎస్సీ కార్పొరేషన్ వాహనాల మంజూరులో పారదర్శకత పాటించాలని ఇవాళ ప్రజావాణిలో కలెక్టర్ డా. సత్య శారదకు విన్నవించారు. జొమాటో డెలివరీగా పని చేస్తున్న తాను అద్దె వాహనాలతో ఇబ్బందులు పడుతున్నానని, స్వయం ఉపాధి పథకం ద్వారా ఎలక్ట్రిక్ వాహనం మంజూరు చేసి ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు.