NRML: వేసవి కాలంలో ప్రజల దాహార్తి తీర్చడం కోసం చలివేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని కడెం మండలం పెద్ద బెల్లాల్ సర్పంచ్ ఈదుల తిరుపతి అన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పెద్ద బెల్లాల్ గ్రామాల్లో చలి వేంద్రాన్ని ఏర్పాటు చేసి సోమవారం ప్రారంభించారు. వేసవిలో ప్రజలు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తక్కల రమ్య ఉన్నారు.