టాలీవుడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో షానీల్ డియో దర్శకత్వంలో ‘డెకాయిట్’ మూవీ రాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి అడివి శేష్ అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమాలోని తదుపరి పాట త్వరలోనే రాబోతుందని, ఈ పాటలో తాను మొదటిసారి డ్యాన్స్ చేశానని తెలిపాడు. ఈ పాట ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని చెప్పాడు. ఇక ఈ సినిమా 2026 ఏప్రిల్ 10న విడుదల కానుంది.