KMM: కల్లూరు (M) ఐక్య క్రైస్తవ సమైక్య, ఇండిపెండెంట్ క్రిస్టియన్ కమిటీ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సంబంధించిన పోస్టర్ను ఎఐసీసీ రాష్ట్ర అధ్యక్షులు ఏనోష్ కుమార్ ఇవాళ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన క్రైస్తవ నాయకులు సమావేశమై రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.