SRD: పశువులకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించి వాటిని రక్షించుకోవాలని మండల పశు వైద్యాధికారి డా. జెస్సీ అన్నారు. సోమవారం సిర్గాపూర్ మండలం జమ్లా తాండలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని సర్పంచ్ విస్లావత్ పార్వతి బాయి ప్రారంభించారు. పశు దన్ యాప్ ద్వారా టీకాలు వేసే ప్రక్రియ కొనసాగుతుందని ఆమె చెప్పారు.