CTR: వెదురుకుప్పం మండలం మాంబేడు పంచాయతీ పరిధిలోని D.R.N కండ్రిగలో ఉన్న శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత కొండమల్లీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిషేకాలు, పుష్పాలంకరణ, హారతి కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. శివుడు, అన్నమయ్య కీర్తనలు ఆలపించి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పారు.