ప్రకాశం: రాష్ట్ర మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాజీ మంత్రి కొడాలి నానిపై తీవ్ర విమర్శలు చేశారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురించి నీతులు చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. జగన్ పాలనలో అవినీతి, అరాచకాలు పెరిగాయని, గత ఐదేళ్లలో జరిగిన పరిపాలనను ప్రజలు తిరస్కరించి వైసీపీని ఓటుతో గద్దె దించారని తెలిపారు.