అనంతపురం జిల్లాలో 2027 జనాభా గణన ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇండ్ల జాబితా, గణనపై మొదటి విడత శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈసారి గణన పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతుందని, క్షేత్రస్థాయిలో డేటా సేకరణపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలని సూచించారు.